Walking Benefits: ఉదయం నడక మంచిదా? సాయంత్రం నడక మంచిదా? నిపుణులు ఏం చెప్తున్నారు
Walking Benefits: ఉదయపు గాలిలో పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Is morning walking better or evening walking better?
నడక అనేది ఆరోగ్యానికి అత్యంత సరళమైన, సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాయామం అని చెప్పాలి. ఏ వయసు వారైనా చాలా సులభంగా చేయగలిగే వ్యాయాయం ఇది. అయితే చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే.. ఉదయం నడక మంచిదా? లేక సాయంత్రం నడక మంచిదా? అని. మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నడక వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆరోగ్యకరమైన గాలి: ఉదయపు గాలిలో పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
మెటబాలిజం స్టార్ట్ అవుతుంది: ఖాళీ కడుపుతో నడక వల్ల బాడీ ఫ్యాట్‌ను వేగంగా ఉపయోగించుకుంటుంది. దీనివల్ల బరువు సులభంగా తగ్గుతుంది.
మెదడు ఉల్లాసంగా ఉంటుంది: ఉదయపు సూర్యకాంతి సిరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
ఉత్సాహంగా ఉంటుంది: ఉదయం నడకవల్ల రోజు మొత్తం ఉత్సాహంగా సాగుతుంది.
నిద్ర నాణ్యత మెరుగవుతుంది: ఉదయపు వ్యాయామం రాత్రి మంచి నిద్రకు సహాయపడుతుంది.
సవాళ్లు:
చలికాలంలో లేదా అలసటగా ఉన్నప్పుడు తెల్లవారుజామున లేవడం కాస్త కష్టమవుతుంది.
ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలున్నవారు చలిలో బయటికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది.
సాయంత్రం నడక వల్ల లాభాలు:
బరువు నియంత్రణకు సహాయపడుతుంది: సాయంత్రం నడక ముఖ్యంగా భోజనానంతరం నడక జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. శరీరంలో ఊబకాయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
స్ట్రెస్ రిలీఫ్: రోజంతా పనిపోటీతో ఒత్తిడికి గురైన వారికి సాయంత్రం నడక ఓ విశ్రాంతిని ఇస్తుంది.
ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌తో నడవొచ్చు: ఉదయం ఒంటరిగా నడక వేయాల్సి వస్తే, సాయంత్రం సామూహికంగా చేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది.