భారతదేశంలో కరోనా వైరస్ ‘కమ్యూనిటీ’ వ్యాప్తి లేదు : ICMR వెల్లడి

  • Published By: sreehari ,Published On : March 20, 2020 / 11:13 AM IST
భారతదేశంలో కరోనా వైరస్ ‘కమ్యూనిటీ’ వ్యాప్తి లేదు : ICMR వెల్లడి

Updated On : March 20, 2020 / 11:13 AM IST

భారతదేశంలో కరోనా వ్యాప్తి మూడో దశ నడుస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ భయాందోళన నెలకొంది. ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 5కు చేరగా, 200 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా దాదాపు షట్ డౌన్ అయింది. ప్రత్యేక రైలు సర్వీసులను, అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేసింది భారత ప్రభుత్వం.

అంతేకాకుండా సరిహద్దులు కూడా మూసివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కమ్యూనిటీ (Covid-19) వ్యాప్తి లేదని భారత కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పునరుద్ఘాటించింది. కోవిడ్-19 వ్యాధి మన దేశంలో సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) జరగలేదని, అన్ని నమూనా పరీక్షల్లోనూ నెగెటివ్ అనే ఫలితాలు వచ్చాయని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అవుతున్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది.

See Also | కరోనాను కనిపెట్టిన డాక్టర్ కుటుంబానికి వూహాన్ పోలీసుల క్షమాపణ

కరోనా వైరస్ కమ్యూనిటీ ద్వారా వ్యాపించడం లేదని ICMR డైరెక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. కమ్యూనిటీ ద్వారా వ్యాప్తిచెందుతుందో లేదో తెలుసుకునేందుకు 820 శాంపిల్స్ సేకరించామని తెలిపారు. ‘‘అత్యంత తీవ్ర శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల కోసం పరీక్షించిన అన్ని రాండమ్ శాంపిల్స్‌లో కోవిడ్-19 నెగెటివ్ అని తేలింది. భారత దేశంలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని తెలుస్తోంది’’ అని చెప్పారు.

భారత్ 30 రోజుల వ్యవధిలో ఎక్కడా కూడా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని స్టేజ్ 4లోకి ప్రవేశిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాల్లో చైనా, ఇటలీ, ఇరాన్, సాపిన్ దేశాలన్నీ కొవిడ్-19తో నాల్గో దశను దాటేశాయి. గురువారం నాటికి భారతదేశంలో కొవిడ్-19 కేసులు 167కు చేరుకున్నాయి. అందులో 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకూ దేశంలో నలుగురు మాత్రమే కరోనా ఇన్ఫెక్షన్లతో మృతిచెందారు. అందులో ఒక్కొక్కరు ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రలో చనిపోయారు.