Thyroid Disease: మీకు థైరాయిడ్ సమస్య ఉందా.. అయితే ఈ ఫుడ్ అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
Thyroid Disease: థైరాయిడ్ సమస్య ఉన్నవారు సోయా, సోయా ఉత్పత్తులను తినకూడదు. టోఫు, సోయా మిల్క్, సోయా సాస్ లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

People with thyroid problems should not consume this food at all.
థైరాయిడ్ గ్రంధి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన హార్మోన్‌లు ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరంలో శక్తి వినియోగాన్ని, శరీర ఉష్ణోగ్రతను, గుండె స్పందనను, మెటబాలిజాన్ని నియంత్రిస్తాయి. ఈ గ్రంధిలో అసమతుల్యత కారణంగా వల్ల రెండు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి హైపోథైరాయిడిజం (Hypothyroidism), రెండవది హైపర్‌థైరాయిడిజం (Hyperthyroidism). ఈ సమస్యతో బాధపడుతున్నవారు సంఖ్యా కూడా చాలా పెరుగుతోంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే దేనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ సమస్య ఉన్నవారు ఆహరం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలను అసలు తీయూకోకపోవడం మంచిది అని చెప్తున్నారు. మరి ఆ ఆహారం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఆహారాలు:
1.సోయా, సోయా ఉత్పత్తులు:
థైరాయిడ్ సమస్య ఉన్నవారు సోయా, సోయా ఉత్పత్తులను తినకూడదు. టోఫు, సోయా మిల్క్, సోయా సాస్ లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్స్ అనే పదార్థాలు థైరాయిడ్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదం.
2.గోయిత్రోజెనిక్ ఫుడ్స్:
బ్రోకలీ, కాలిఫ్లవర్, క్యాబేజి, మస్టర్డ్ గ్రీన్స్ లాంటి పదార్థాలలో గోయిత్రోజెన్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంధి యోడిన్‌ను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో ఆటంకం కలిగించవచ్చు.
3.అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారం:
బర్గర్లు, పిజ్జాలు, ప్యాకెట్ స్నాక్స్ లో అధిక సోడియం ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ మందులు వాడే వారికి హై బీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది.
4.అధిక చక్కెర, మిఠాయిలు:
థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో మెటబాలిజం మందగిస్తుంది. ఈ పరిస్థితిలో చక్కెర అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాద ఉంది.
5.గ్లూటెన్ (Gluten) కలిగిన ఆహారం:
గోధుమ, బార్లీ, ఓట్స్ లలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యకు గురి కావచ్చు. కాబట్టి, ఈ ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించడం మంచిది
తినకూడని ఆహారాలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి?
- థైరాయిడ్ హార్మోన్ స్రవణం మరింత తగ్గుతుంది
- మందుల ప్రభావం తగ్గిపోతుంది.
- బరువు పెరుగుతుంది లేదా తగ్గిపోతుంది
- అలసట, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చు
- మానసిక స్థితిలో మార్పులు రావచ్చు.
- గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు సరైన ఆహార నియమాలు పాటించటం అత్యంత అవసరం. వైద్యుల సలహాతో సరైన మందులు వాడుతూ ఆహారాలను జాగ్రత్తగా గుర్తించి నివారించాలి. మంచి జీవన శైలి, నియంత్రిత ఆహారం, వ్యాయామం మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.