రష్యా కరోనా వ్యాక్సిన్ ప్రొడక్షన్ మొదలైంది.. ఆగస్టు ఆఖరులో అందుబాటులోకి..

కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి ముందుగా గుడ్ న్యూస్ చెప్పింది రష్యా.. కరోనా వ్యాక్సిన్ తామే ముందు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అన్నట్టుగా అన్ని దేశాల కంటే ముందే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల చేసింది.. రష్యా కరోనా వ్యాక్సిన్ ప్రొడక్షన్ మొదలైంది.. ఆగస్టు ఆఖరులో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రష్యా ఆగస్టు 12న రిజిస్ట్రేషన్ అయింది.
ప్రపంచ దేశాల్లోనూ కరోనా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. అన్ని దేశాల్లో కంటే ముందుగానే రష్యా కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చింది. కోవిడ్ -19 కోసం రష్యా కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయడం ప్రారంభించిందని శనివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మాస్కో గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ ఉత్పత్తికి వెళ్ళే మొదటి టీకాను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మాస్కో భద్రతకు జాతీయ ప్రతిష్ట గురించి కొంతమంది శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.
హ్యూమన్ టెస్ట్ దశలో ఉందని చెప్పిన COVID-19 వ్యాక్సిన్ కు రెండు నెలల్లోనే రష్యా ఆమోదం తెలపడంపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి టెస్టులు జరగకుండా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తే ఎలా నమ్మాలంటున్నారు. రష్యా తీసుకున్న నిర్లక్ష్యపు వైఖరేనంటూ పెదవి విరుస్తున్నారు.
స్పుత్నిక్-వి పేరిట పిలిచే ఈ టీకాను.. Gamaleya Research Institute and the Russian defence ministry రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ ఈ టీకా వేయించుకుంటే రెండేళ్లపాటు కరోనా నుంచి రక్షణ పొందవచ్చునని తెలిపారు. రష్యాకు చెందిన అధికారులు, WHOకు చెందిన అధికారులు ఈ ప్రక్రియపై WHO ప్రతినిధి వెల్లడించారు. ఎంతవరకూ సురక్షితం అనే అంశంపై సమగ్ర సమీక్ష, అంచనా తర్వాతే అనుమతిస్తామని తెలిపారు.