బీట్ రూట్ బెస్ట్ ఫుడ్డే.. కానీ ఈ 6 సమస్యలు ఉన్నోళ్లు తినకూడదు

'బీట్‌రూట్' మంచి న్యూట్రిషన్ ఫుడ్డే కానీ వీళ్లు తీసుకుంటే..ఇక అంతే సంగతులు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌ని తీసుకోకూడదంటే...

బీట్ రూట్ బెస్ట్ ఫుడ్డే.. కానీ ఈ 6 సమస్యలు ఉన్నోళ్లు తినకూడదు

Updated On : February 17, 2025 / 3:19 PM IST

బీట్‌రూట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది చర్మ ఆరోగ్యాన్నికూడా మెరుగుపరుస్తుంది. అయితే.. అలాంటి బోలేడు ఖనిజాలు ఉన్న ఈ న్యూట్రిషన్ ఫుడ్ ని తీసుకోవడం వలన కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా కింద ఇవ్వబడిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: పళ్లు తెల్లగా అవ్వాలని ఇంతింత పేస్టేసి రప్పా రప్పా తోమేస్తున్నారా?.. ఒక్క నిమిషం.. )

బీట్‌రూట్‌ జ్యూస్‌ ఎవరు తాగకూడదు..?

కిడ్నీలో రాళ్లు: బీట్‌రూట్ లో ఆక్సలేట్లు అధికంగా ఉండడం వలన కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు పొరపాటున కూడా బీట్‌రూట్‌ని తినకూడదు.

తక్కువ రక్తపోటు: బీట్‌రూట్‌లో నైట్రేట్ సమృద్ధిగా ఉండటంతో అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, తక్కువ రక్తపోటుతో బాధపడేవారు దీన్ని అప్రమత్తంగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది రక్తపోటును మరింత తగ్గించి సమస్యను పెంచే అవకాశం ఉంది.

బ్లడ్ షుగర్ పేషెంట్స్: బీట్‌రూట్‌లో అధికంగా ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు బీట్‌రూట్ వినియోగాన్ని పరిమితం చేయడం మంచిది.

అధిక ఐరన్ స్థాయి: బీట్‌రూట్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. తక్కువ ఐరన్ కలిగినవారికి ఇది ప్రయోజనకరమైనప్పటికీ, హిమోక్రోమాటోసిస్ (అధిక ఐరన్ నిల్వలతో కూడిన వ్యాధి) ఉన్నవారు దీన్ని అధికంగా తీసుకోవడం మంచిది కాదు.

కడుపులో గ్యాస్ సమస్యలు: బీట్‌రూట్‌లో అధిక ఫైబర్ ఉండడం వలన కొందరికి కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యలు పెరుగవచ్చు. (చదవండి: కాఫీ ఎన్నిసార్లు కాదన్నయ్యా.. ఎప్పుడు తాగామన్నదే ఇంపార్టెంట్.. కొత్త సర్వేలో కొత్త విషయాలు.. )

అలర్జీ సమస్య ఉన్నవారు: కొందరికి బీట్‌రూట్ తినడం వలన అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, చర్మం మండటం లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. బీట్‌రూట్ తిన్న తర్వాత అలాంటి లక్షణాలు కనిపించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, కానీ దాన్ని సమతులంగా, మీ ఆరోగ్య పరిస్థితిని అనుసరించి తీసుకోవడం అవసరం.

Disclaimer: ఇందులో ఉన్న విషయాలను మేము ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి, అవగాహన కోసమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము.