నల్లాలో పడిన చిన్నారి…15నిమిషాల్లోనే క్షేమంగా బయటకి

నల్లాలో పడిన నాలుగేళ్ల చిన్నారి 15 నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు వచ్చింది. ఓ ఫైర్ మెన్,స్థానికుడు జాయింట్ ఎఫర్ట్ తో చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారింది.చెత్తలో చిక్కుకున్న చిన్నారి క్షేమంగా బయటికొచ్చింది.తమ కూతురు అంత ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు
హైదరాబాద్ లోని గౌలిగూడలో ఆదివారం(ఏప్రిల్-21,2019)ఉదయం 10గంటల సమయంలో నాలుగేళ్ల చిన్నారి దివ్య తన అక్క,నలుగురు స్నేహితురాళ్లతో కలిసి ఇంటికి టిఫిన్ తీసుకెళ్లేందుకు హోటల్ దగ్గరకు వెళ్తున్న సమయంలో సడన్ గా దివ్య నల్లాలో పడిపోయింది.సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు స్థానికులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.15 నిమిషాల్లోనే చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
ఫైర్ కానిస్టేబుల్ క్రాంతికుమార్ చిన్నారిని కాపాడేందుకు 12అడుగుల లోతు ఉన్న మాన్ హోల్ లోకి దిగి,చిన్నారి కోసం పెద్దగా అరిచాడని,ఇంతతో చిన్నారి ఏడుపు వినిపించి అక్కడికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడని తెలిపారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారిందని గౌలిగూడ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ రాజ్ కుమార్ తెలిపారు. చిన్నారి చెత్తలో చిక్కుకుపోవడం వల్లనే క్షేమంగా బయటి తీసుకురాగలిగినట్లు ఆయన తెలిపారు.
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు