ఎట్టకేలకు లభ్యమైన రోహిత ఆచూకీ

  • Published By: vamsi ,Published On : January 15, 2020 / 08:12 AM IST
ఎట్టకేలకు లభ్యమైన రోహిత ఆచూకీ

Updated On : January 15, 2020 / 8:12 AM IST

ఉన్నత చదువులు చదివి యాపిల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరిన రోహిత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. గచ్చిబౌలి పోలీసులు ఆమె పుణెలో ఉన్నట్లుగా కనుగొన్నారు. కుటుంబ కలహాలతో ఆమె పుణె వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల దగ్గరకు తిరిగి వచ్చేందుకు రోహిత ఒప్పుకోకపోవడంతో ఆమెను బంధువులకు అప్పగించనున్నారు. 

34ఏళ్ల రోహిత డిసెంబర్ 26వ తేదీన హైదరాబాద్‌లో అదృశ్యం అయ్యింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో.. విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కిన రోహిత..  తర్వాత కనిపించకుండా పోయింది. అనంతరం ఆమె కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కూడా రూమ్‌లోనే వదిలి వెళ్లడంతో చివరగా రోహిత ఎక్కడికి వెళ్లింది..? అన్నది పోలీసులు తెలుసుకోలేకపోయారు.

దీంతో ఆమె కనిపించకపోవడం మిస్టరీగా మారగా..  పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆమె కనిపించకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే చివరకు ఆమె క్షేమంగా ఉన్నట్లు తెలుసుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 19 రోజుల నుంచి రోహిత ఆచూకిని కనుగొనేందుకు ఎనిమిది టీమ్‌లు పనిచేశాయి. రొహిత ఆచూకి కొసం రెండు రాష్ట్రాల్లో గాలించగా.. చివరకు ఆమె ఆచూకి చిక్కినట్లుగా తెలుస్తుంది.