Asaduddin Owaisi on protests: వీలైనంత త్వరగా రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్ ఒవైసీ

 హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతోన్న ఆందోళనలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ''రాజాసింగ్ ప్రసంగం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయి. వీలైనంత త్వరగా ఆయనను జైలుకు పంపాలి. అలాగే, శాంతియుత వాతావరణానికి సహకరించాలని నేను మరోసారి అందరినీ కోరుతున్నాను. హైదరాబాద్ మన ఇల్లు వంటిది. మతతత్వ ఉచ్చులో ఇది చిక్కుకోవద్దు'' అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Asaduddin Owaisi on protests: వీలైనంత త్వరగా రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi on protests

Updated On : August 25, 2022 / 10:34 AM IST

Asaduddin Owaisi on protests: హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతోన్న ఆందోళనలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ”రాజాసింగ్ ప్రసంగం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయి. వీలైనంత త్వరగా ఆయనను జైలుకు పంపాలి. అలాగే, శాంతియుత వాతావరణానికి సహకరించాలని నేను మరోసారి అందరినీ కోరుతున్నాను. హైదరాబాద్ మన ఇల్లు వంటిది. మతతత్వ ఉచ్చులో ఇది చిక్కుకోవద్దు” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

షాఅలీ బండ, ఆశాటాకీస్ లో పోలీసులు 90 మంది యువతను అరెస్టు చేశారని, డీసీపీ తన విజ్ఞప్తితో వారిని విడిచిపెట్టారని ఒవైసీ అన్నారు. శాంతియుత వాతావరణం తీసుకురావడానికి ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాతో పాటు తమ కార్పొరేటర్లు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను వారితో పాటు హైదరాబాద్ పోలీసులతో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు.

ఓ కేసులో పోలీసులు కొందరి ఇళ్ళలోకి వచ్చి ఐదుగురిని బలవంతంగా లాక్కెళ్ళారని, అది సరికాదని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. తాను పోలీసులతో మాట్లాడి విడిపించానని తెలిపారు. కాగా, పాతబస్తీలో ఆందోళనలు చెలరేగుతుండడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు