కొత్త ఎస్‌ఐలకు బేసిక్ ఇండక్షన్ కోర్సు

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో చేరిన కొత్త ఎస్‌ఐలకు బేసిక్ ఇండక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ తెలిపారు. 678 మంది సివిల్ ఎస్‌ఐలకు అకాడమిలో ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ అకాడమి ఆధ్వర్యంలో తొలిసారిగా ఉస్మానియా యూనివర్శిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు.
పోలీసు విధుల్లో తీసుకోవాల్సిన కొత్త పద్ధతులు, అప్రోచ్ విధానాన్ని కొత్త ఎస్‌ఐలకు శిక్షణ ద్వారా తెలుపుతారని వెల్లడించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సైకలాజికల్ ప్రొఫైలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ సైకాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ డాక్టర్ స్వాతి నేతృత్వంలో ఈ ఇండక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.