పెట్రోల్ బంక్ లో మోసాలు

హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మోసాలు. రాష్ట్రంలోనే పెట్రో, డీజిల్‌ వినియోగంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాటా సగానికి పైనే ఉంటుంది. డిస్‌ప్లేలో దగా, స్టాంపింగ్‌ లేకుండా బంకుల నిర్వహణ కొనసాగుతూనే ఉంది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 04:05 AM IST
పెట్రోల్ బంక్ లో మోసాలు

Updated On : January 21, 2019 / 4:05 AM IST

హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మోసాలు. రాష్ట్రంలోనే పెట్రో, డీజిల్‌ వినియోగంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాటా సగానికి పైనే ఉంటుంది. డిస్‌ప్లేలో దగా, స్టాంపింగ్‌ లేకుండా బంకుల నిర్వహణ కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మోసాలు. రాష్ట్రంలోనే పెట్రో, డీజిల్‌ వినియోగంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాటా సగానికి పైనే ఉంటుంది. డిస్‌ప్లేలో దగా, స్టాంపింగ్‌ లేకుండా బంకుల నిర్వహణ కొనసాగుతూనే ఉంది. జంట జిల్లాల్లో ప్రధాన మూడు కంపెనీలకు సుమారు 447 పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉన్నాయి. ప్రతిరోజు  ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. 
హైదరాబాద్‌ పెట్రోల్‌ బంకుల్లో డీలర్ల చేతివాటంతో ప్రతి లీటర్‌కు 10 నుంచి 20 ఎంఎల్‌ వరకు తక్కువ పెట్రోల్ పోయడం సాధారణమైంది. తూనికల,కొలతల శాఖ నిబంధనల ప్రకారం ఐదు లీటర్లలో 25 ఎంఎల్‌ వరకు తక్కువగా ఉండవచ్చు. కానీ ప్రతి లీటర్‌లో  తక్కువగా పంపింగ్‌ జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఏడాదికోసారి తనిఖీల పేరుతో హడావుడి :
హైదరాబాద్‌లో దాదాపు 447 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఒక్కో పెట్రోల్‌ బంకులో ఆరు నుంచి 10 వరకు ఫిల్లింగ్‌ మెషిన్లు ఉన్నాయి.  ఈ లెక్కన  సుమారు మూడు వేల వరకు  ఫిల్లింగ్‌ మెషిన్లు ఉన్నట్లు అంచనా. తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి  ఫిల్లింగ్‌ మెషిన్లను పరిశీలించి  స్టాంపింగ్‌  చేస్తారు. ఏటా రెన్యూవల్‌ కోసం సదరు డీలరు గడువు కంటే మందే తూనికల కొలత శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  తూనికల, ఆయిల్‌ కంపెనీల అధికారులతో పాటు ఇద్దరు టెక్నిషియన్ల సమక్షంలో పంపింగ్‌ మెషిన్‌లో మెజర్‌మెంట్‌ను పరిశీలించి స్టాంపింగ్‌ చేస్తారు.. మెజర్‌మెంట్‌లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సరి చూసి స్టాంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో  తూనికల, కొలుతల అధికారులు బంకులు యాజమానులకు అనుకూలంగానే మెజర్‌మెంట్‌ విషయంలో సహకారం అందిస్తారు. దీనికితోడు బంకుల యాజమానులు సీల్‌ను బ్రేక్‌ చేసినా వారు పట్టించుకోవడం లేదు.