లాక్ డౌన్ వేళ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 03:18 PM IST
లాక్ డౌన్ వేళ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది

Updated On : March 29, 2020 / 3:18 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు భయపడాల్సిన పని లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. వరి ధాన్యం కోటి 5లక్షల టన్నుల దిగుబడి ఉండొచ్చని,  మొక్కజొన్న 14.5లక్షల టన్నుల దిగుబడి ఉండొచ్చని ఎం కేసీఆర్ అంచనా వేశారు. ఈ దిగుబడి అంతా ప్రభుత్వమే కొంటుందని, రైతులు పరేషాన్ కావొద్దని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి మే 10 వరకు ధాన్యం కొనుగోలు:

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు కేసీఆర్. అంతా మార్కెట్ కు వస్తే కరోనా ప్రబలే ప్రమాదం ఉందని, అందుకే ప్రభుత్వమే గ్రామాల్లోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందని వివరించారు. వందశాతం… కొనుగోలు కేంద్రంలోనే కొంటామన్నారు. అప్పటివరకు రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కూపన్లు ఇచ్చి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 10 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆన్ లైన్ లో రైతులకు చెల్లింపులు చేస్తామని కేసీఆర్ తెలిపారు.

రైతుల ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కామెంట్స్:
* కూపన్లు ఇచ్చి తేదీ ప్రకారమే పంటను అమ్మకానికి తేవాలి
* రూ.3వేల 200 కోట్ల పైచిలుకు డబ్బుకు మార్క్ ఫెడ్ గ్యారెంటీ ఇచ్చాం
* మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, గ్రామాల్లోనే కొనుగోలు
* నియంత్రిత కొనుగోళ్ల కేంద్రాల ద్వారా కొనుగోళ్లు
* రైతులు పరేషాన్ కావొద్దు
* కూపన్ ప్రకారమే ధాన్యం కొనుగోలు, పైరవీలు పని చేయవు
* 100శాతం మార్కెటింగ్ కేంద్రాలకు తాళం వేశాం

* ఏప్రిల్ 1 నుంచి మే 10 వరకే ధాన్యం కొనుగోలు చేస్తాం
* కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడంతో పంటలు బాగా పండాయి
* చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 40లక్షల ఎకరాల్లో వరి పంట పండుతోంది
* ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అయినా రైతుల కోసం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
* ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు
* ఇలాంటి పరిస్థితుల్లోనూ సివిల్ సప్లయ్స్ కు ప్రభుత్వం రూ.25వేల కోట్లు సమకూర్చింది
* కొనుగోళ్లు కేంద్రాల దగ్గరికి జాతరగా రావొద్దు
* కొనుగోళ్లు కేంద్రాల దగ్గర రింగ్స్ వేయాలి
* ఈసారి గ్రామాల్లోనే పంటల కొనుగోళ్లు