ఏం నిర్ణయం తీసుకుంటారు : ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 08:01 AM IST
ఏం నిర్ణయం తీసుకుంటారు : ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

Updated On : November 26, 2019 / 8:01 AM IST

ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల

ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల ఆందోళన, ఆర్టీసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిపోల మందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జేఏసీ సూచనల మేరుకు విధుల్లో చేరుతామంటూ డిపోల్లోకి దూసుకెళ్తున్నారు. దీంతో పోలీసుల వందల సంఖ్యలో కార్మికులను అరెస్ట్ చేశారు. అన్ని డిపోల్లోనూ 144 సెక్షన్‌ విధించారు. 

డిమాండ్ల సాధన కోసం చేపట్టిన 52 రోజుల సమ్మెను కార్మికులు బేషరతుగా విరమించిన సంగతి తెలిసిందే. సమ్మె విరమిస్తున్నామని సోమవారం (నవంబర్ 25,2019) సాయంత్రం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం(నవంబర్ 26,2019) నుంచి కార్మికులు విధుల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావొద్దని కోరారు. నైతిక విజయం తమదేనని చెప్పారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

అయితే కార్మికులకు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ షాక్ ఇచ్చారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతల ప్రకటన హాస్యాస్పదమని సునీల్‌ శర్మ అన్నారు. ఇష్టమొచ్చినపుడు గైర్హాజరై.. ఇప్పుడు చేరతామంటే కుదరదని అన్నారు. ఇష్టానుసారం చేస్తామంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధ్యం కాదని చెప్పారు.