కేసీఆర్ ప్రెస్ మీట్ : బీసీలపై విపక్షాలవి కపట ప్రేమ
బీసీలపై ఎవరికి ప్రేమ ఉంది ? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు..పథకాలు చూస్తే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పిచ్చి పిచ్చి మాటలు..మాట్లాడి..అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే...
బీసీలపై ఎవరికి ప్రేమ ఉంది ? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు..పథకాలు చూస్తే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పిచ్చి పిచ్చి మాటలు..మాట్లాడి..అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే…
హైదరాబాద్ : బీసీలపై ఎవరికి ప్రేమ ఉంది ? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు..పథకాలు చూస్తే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పిచ్చి పిచ్చి మాటలు..మాట్లాడి..అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే… ఎలాంటి తీర్పు వస్తుందో ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్…డిసెంబర్ 29వ తేదీ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
బీజేపీ డిపాజిట్ గల్లంతు…
ఐదుగురు ముఖ్యమంత్రులు…11 మంది కేంద్ర మంత్రులు…ముఖ్యమంత్రులు..పార్టీ చీఫ్..ప్రచారం చేసినా బీజేపీ పరాజయం చెందిందన్నారు. 118 చోట్ల పోటీ చేసినా 103 చోట్ల డిపాజిట్ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అలానే మాట్లాడారని…అయినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. బీసీలపై ప్రేమ వొలక పోస్తున్నట్లు మాట్లాడుతున్నారని…బీసీలకు ఎవరి మీద ప్రేమ ఉందో అందరికీ తెలిసిందేన్నారు. బీసీల కోసం గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు 19 ఉంటే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 261 పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరికి ప్రేమ ఉందో ఈ సంఖ్య చూస్తే తెలుస్తుందని కేసీఆర్ తెలిపారు.