గుడ్ న్యూస్, ఏప్రిల్ 7నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ
ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా,

ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా,
ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా, ధాన్యం, పంటల కొనుగోలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు సీఎం చెప్పారు. కరోనా బాధితులు కోలుకుంటున్నారని సీఎం తెలిపారు. ఇవాళ(మార్చి 29,2020) 11మందికి కరోనా నయమైందన్నారు. రేపు(మార్చి 30,2020) ఆ 11మందిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. మరో 58మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. ఇకపై రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువ అని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరికైనా అంటిస్తే తప్ప కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశమే లేదన్నారు కేసీఆర్. సామాజిక దూరమే కరోనాకు ఏకైక మందు అన్నారు కేసీఆర్.
70మంది కరోనా బాధితుల్లో ఇప్పటికే ఒకరు కోలుకున్నారని కేసీఆర్ తెలిపారు. కోలుకున్న వ్యక్తి ప్రధాని మోడీతో కూడా మాట్లాడినట్టు కేసీఆర్ వెల్లడించారు. 70మందిలో ఇవాళ 11మందికి కరోనా నయం కాగా, 58మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందన్నారు. అందరూ కోలుకుంటారని, డిశ్చార్జ్ అవుతారని సీఎం కేసీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. 25వేల 900మంది పర్యవేక్షణలో ఉన్నారని, వారిలో చాలామంది క్వారంటైన్ సమయం పూర్తవుతోందన్నారు.
కరోనా వ్యాధికి మందు లేదన్న సీఎం కేసీఆర్, సెల్ఫ్ కంట్రోల్ ఒక్కటే మార్గం అన్నారు. లాక్ డౌన్ కచ్చితంగా పాటించడం, పోలీసులకు, వైద్య అధికారులకు సహకరించడం ఒక్కటే మన ముందున్న ఆయుధం అన్నారు. సౌత్ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా 59వేల మందికి కరోనా వైరస్ వచ్చిందని, ఇది చాలా డేంజరస్ అని కేసీఆర్ చెప్పారు. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అదే తెలివైన పని అన్నారు. గండం గట్టెక్కే దాకా క్రమశిక్షణగా ఉండాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. లాక్ డౌన్, కర్ఫ్యూ ఉన్నంత కాలం ప్రజలు స్వీయ నియంత్రణలోనే ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. 25వేల 932 మందికి ఏప్రిల్ 7 నాటికి పర్యవేక్షణ పూర్తవుతుందన్న సీఎం కేసీఆర్, ఆ తర్వాత అబర్జేషన్ లో ఉన్న అనుమానితుల సంఖ్య జీరో అవుతుందన్నారు. కొత్త కేసులు ఏవీ నమోదు కాకపోతే ఏప్రిల్ 7 తర్వాత మన రాష్ట్రం కరోనా ఫ్రీ తెలంగాణ అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. క్రమశిక్షణ, స్వీయరక్షణే కరోనాను ఎదుర్కోనే ఏకైక మందు అన్నారు కేసీఆర్.
కరోనాపై సీఎం కేసీఆర్ కామెంట్స్:
* తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు
* ఇప్పటికే ఒకరు డిశ్చార్జ్
* 69మందిలో ఇవాళ(మార్చి 29,2020) 11మందికి కరోనా నయమైంది
* రేపు 11మంది డిశ్చార్జ్
* ఇంకా 58మందికి కొనసాగుతున్న చికిత్స
* ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ
* ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా ఉండదు
* 25వేల 927 మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు
* ఏప్రిల్ 7 నాటికి వారి క్వారంటైన్ పూర్తవుతుంది
* క్వారంటైన్ లో ఉన్నవారిని 5వేల 746 టీమ్ లు నిరంతరం పరిశీలిస్తున్నాయి
* ఏప్రిల్ 7 తర్వాత కొత్త కేసులు వచ్చి చేరే అవకాశం చాలా తక్కువ
* విదేశాల నుంచి ఇప్పటికే వచ్చిన వారు ఎవరికైనా అంటిస్తే తప్ప కరోనా రాదు
* లాక్ డౌన్ ఆయుధాన్ని సరిగ్గా వినియోగించాం
* మార్చి 31కి 1440, ఏప్రిల్ 1కి 1461, ఏప్రిల్ 2కి 1887మంది, ఏప్రిల్ 3కి 1476, ఏప్రిల్ 4కి 1453, ఏప్రిల్ 5కి 914, ఏప్రిల్ 6కి 454, ఏప్రిల్ 7కి 397మందిపై సర్వైలెన్స్ ముగుస్తుంది
* గండం నుంచి బయటపడే వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలి
* లాక్ డౌన్ ఉన్నంత కాలం పోలీసులకు, వైద్య అధికారులకు ప్రజలు సహకరించాలి