దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదు : చాడా వెంకట్ రెడ్డి
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.

దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు. గతంలో వరంగల్ ఎన్ కౌంటర్ తో మహిళలపై అత్యాచారాలు ఆగాయా అని ప్రశ్నించారు. నిందితులను మానసికంగా కృంగిపోయేలా చెయ్యాలే తప్ప ఎన్ కౌంటర్లు సరికాదని అభిప్రాయపడ్డారు. కమిటీ వేసి దిశ నిందితుల ఎన్ కౌంటర్ తీరును పరిశీలిస్తామని చెప్పారు. కమిటీ పరిశీలన అనంతరమే స్పందిస్తామని తెలిపారు.
మరోవైపు అదే పార్టీకి చెందిన నేత నారాయణ దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నాని అన్నారు. దిశా హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసు డిపార్ట్ మెంట్ ఎన్ కౌంటర్ చేయటం సంతోషం అన్నారు. మహిళలపై ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్నమాట వాస్తవమేనని చెప్పారు. ఇలాంటి సమయంలో వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగకుండా ఉండాలంటే నిందితులను హతమార్చటం అవసరం అని అభిప్రాయపడ్డారు.
దిశ హత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం, డిసెంబర్ 6 తెల్లవారుఝూమున ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా 2019, నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ పై నలుగురు నిందితులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను డిసెంబర్5, గురువారం నాడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.