నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 05:34 AM IST
నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

Updated On : March 30, 2019 / 5:34 AM IST

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు. మీరాలం మండీలో విస్తృతంగా పర్యటించారు. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ ఓనర్లు, షాపుల యాజమానులతో మాట్లాడారు. దారిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో చేతులు కలిపారు. మరోసారి తనను గెలిపించాలని కోరారు.
Read Also : గుర్తు పెట్టుకోండి : ఏప్రిల్ 1 బ్యాంకులకు హాలీడే

తనను గెలిపిస్తే పాతబస్తీని మార్చేస్తా అని అసద్ హామీ ఇచ్చారు. అభివృద్ధి తన ప్రధాన అజెండా అని ఓవైసీ చెప్పారు. రోడ్ల వెడల్పు, ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధి తన లక్ష్యం అని ఓవైసీ తెలిపారు. పతేర్ ఘట్టి-గుల్జార్ హౌస్ వెడల్పుకి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెట్రో పనులను ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలను ఓవైసీ ఖండించారు.

తెలంగాణ రాష్ట్రంలో 17మంది ఎంపీలు ఉంటే.. ఎంపీ నిధులను వినియోగించిన ఏకైక ఎంపీ తాను మాత్రమే అని ఓవైసీ చెప్పారు. కేంద్రంలో నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. ప్రధాని ఎవరు అనేది ప్రాంతీయ పార్టీలు డిసైడ్ చేస్తాయన్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని ఓవైసీ చెప్పారు.
Read Also : Check It : ఏప్రిల్ 11న సెలవు

హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న భగవంత్ రావ్.. ఓవైసీపై మండిపడ్డారు. ఎంపీగా అసదుద్దీన్ చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి అస్సలు జరగలేదన్నారు. స్థానికులను చీకట్లో ఉంచారని ఆరోపించారు. పాతబస్తీలో అభివృద్ధి పనులు జరక్కుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రజలను చీకట్లో ఉంచి ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పారు. విద్య, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు, హౌసింగ్ పై ఎంఐఎంకు ఎలాంటి విధానం లేదన్నారు.

ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పాతబస్తీని అభివృద్ధి చేస్తానని, మీ జీవితాల్లో వెలుగు నింపుతానని, విద్య అవకాశాలు కల్పిస్తానని భగవంత్ రావు హామీ ఇచ్చారు. 2014లో తక్కువ శాతం పోలింగ్ నమోదైందని భగవత్ రావు చెప్పారు. ఈసారి పరిస్థితిలో మార్పు ఉంటుందన్నారు. పోలింగ్ శాతం పెరుగుతుందని, బీజేపీకి ఫేవర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రచారం సర్జికల్ స్ట్రయిక్ తరహాలో ఉంటుందన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం అని ఆయన ఆరోపించారు.
Read Also : గెలుపు ఖాయం : సింహం సింగిల్‌గానే వస్తుంది