ప్రభుత్వ సహాయం : బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కులు

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
వీటితోపాటు ఇతర లబ్ధిదారులకు సంబంధించిన చెక్కులను కూడా అందజేస్తామని ఆయన అన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని అంజయ్యభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ కార్యక్రమంలోపలువురు రాష్ట్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గోంటారు. పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.