జలాశయాలకు పోటెత్తుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి మళ్లీ నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 17వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో లక్షా 52వేల క్యూసెక్కులుగా ఉంది.. వరద ఉధృతి అధికంగా ఉండటంతో 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టులకు వరద కొంతమేర పెరిగింది. వరద క్రమంగా పెరుగడంతో జూరాల ప్రాజెక్ట్‌లో ఐదు గేట్లను ఎత్తి 41వేల 386 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌లకు కూడా వరద పెరిగింది. కర్ణాటక ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో మూడు స్పిల్‌వే గేట్లను అడుగుమేర ఎత్తి 4వేల 611 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు.
గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాతున్నది. ఇంకా రెండు అడుగుల వరద నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈ సీజన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 78.842 టీఎంసీల వరద వచ్చింది. భద్రాచలం దగ్గర గోదావరి వరద నిలకడగా ఉంది.
Read More : వెదర్ అప్ డేట్ : తెలంగాణాలో 48 గంటల్లో వర్షాలు