హాకర్స్ జోన్ : ఫుట్‌పాత్ వ్యాపారులకు ఊరట

హైదరాబాద్ ఎన్నో రకాల వ్యాపారాలకు అనువైన నగరం. భారీ మాల్స్ ప్రత్యేక ఆఫర్లతో రారమ్మని ఊరిస్తుంటే.. ఆన్‌లైన్ అమ్మకాలు సిటిజన్స్‌ను అలరిస్తుంటాయి. అయినా ఈ సిటీలో

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 08:09 AM IST
హాకర్స్ జోన్ : ఫుట్‌పాత్ వ్యాపారులకు ఊరట

Updated On : January 27, 2019 / 8:09 AM IST

హైదరాబాద్ ఎన్నో రకాల వ్యాపారాలకు అనువైన నగరం. భారీ మాల్స్ ప్రత్యేక ఆఫర్లతో రారమ్మని ఊరిస్తుంటే.. ఆన్‌లైన్ అమ్మకాలు సిటిజన్స్‌ను అలరిస్తుంటాయి. అయినా ఈ సిటీలో

హైదరాబాద్ ఎన్నో రకాల వ్యాపారాలకు అనువైన నగరం. భారీ మాల్స్ ప్రత్యేక ఆఫర్లతో రారమ్మని ఊరిస్తుంటే.. ఆన్‌లైన్ అమ్మకాలు సిటిజన్స్‌ను అలరిస్తుంటాయి. అయినా ఈ సిటీలో చిరు వ్యాపారాలకు ప్రత్యేక స్థానం ఉంది. వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని చట్టం కూడా చెబుతోంది. ప్రస్తుతం దీనిపైనే దృష్టిపెట్టింది బల్దియా. హాకర్స్ కోసం స్పెషల్ జోన్ ఏర్పాటు చేస్తోంది.

 

హైదరాబాద్‌లో నివసిస్తున్న వారిలో చాలామందికి చిరువ్యాపారుల పిలుపుతోనే తెల్లవారుతుంది. పేపర్, పాలు మాత్రమే కాదు కూరగాయలు, పండ్లను సిటిజన్ వాకిటికి చేరవేస్తున్నారు హాకర్స్. టీ, టిఫిన్, భోజనం కూడా కోరిన సమయానికి అందిస్తున్నారు. ఇలాంటివారిపై దాడులు జరుగుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించడం.. వెండింగ్ జోన్స్ కేటాయించడంతోపాటు వారికి అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదేనని ఆ చట్టంలో పొందుపర్చింది. దీనిని అమలు చేసే దిశగా బల్దియా అడుగులు వేస్తోంది.

 

ఫుట్ పాత్‌లపై, రోడ్డు పక్కన వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతోపాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రత్యేక జోన్ల ఏర్పాటుతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చని నిర్ణయించిన అధికారులు.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 24వేల 580 మంది చిరు వ్యాపారులను గుర్తించారు అధికారులు. ఇందులో 22వేల 324మందికి గుర్తింపు కార్డులు జారీచేశారు. వీరంతా ప్రస్తుతం నో వెండింగ్ జోన్‌లో విక్రయాలు సాగిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారికోసం చందానగర్ సర్కిల్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మోడల్‌గా ప్రత్యేక వెండింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక్కడ 265 మీటర్ల పొడవున వ్యాపారులు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యాపార నిషేధిత ప్రాంతాలను రెడ్ జోన్‌గా… నిరంతరం వ్యాపారం చేసుకునే ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా… నిర్ధారిత సమయాల్లో మాత్రమే వ్యాపారాలను అనుమతించే ప్రాంతాలను యాంబర్ జోన్లుగా విభజించామన్నారు. ఈ చర్యలతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడంతోపాటు.. ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు.

 

* చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
* గ్రేటర్ పరిధిలో 24వేల 580మంది చిరు వ్యాపారులు
* 22వేల 324మందికి గుర్తింపు కార్డులు
* మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రత్యేక వెండింగ్ జోన్
* 265 మీటర్ల పొడవున వ్యాపారాలు సాగించేలా ఏర్పాట్లు
* రెడ్ జోన్‌లో పూర్తిగా చిరు వ్యాపారాల నిషేధం
* గ్రీన్ జోన్‌లో నిరంతరం చిరు వ్యాపారాలు
* యాంబర్ జోన్లులో నిర్ధారిత సమయాల్లోనే వ్యాపారాలు