మేయర్ హర్షం : హైదరాబాద్‌కు స్వచ్చత ఎక్సలెన్సీ అవార్డు

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 05:24 AM IST
మేయర్ హర్షం : హైదరాబాద్‌కు స్వచ్చత ఎక్సలెన్సీ అవార్డు

Updated On : February 11, 2019 / 5:24 AM IST

హైదరాబాద్ : నగరానికి మరో అవార్డు వచ్చింది. స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర స్వచ్చ భారత మిషన్ ప్రకటించింది. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీలలో కేవలం భాగ్యనగరానికి మాత్రమే పురస్కారం దక్కింది. స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌కు 2 అవార్డులు రావడం సంతోషంగా ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అన్నారు. 

బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ..ఇతర శాఖలు క‌ృషి చేస్తున్నాయి. పారిశుధ్యంతో పాటు ప్రజారోగ్యం..ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకరావడం..ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకరావాలనే లక్ష్యంతో ఈ మిషన్ ఏర్పాటు చేశారు.