ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 06:02 AM IST
ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

Updated On : November 16, 2019 / 6:02 AM IST

ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, వరంగల్‌ తూర్పు, జనగామ, మల్కాజిగిరి ఎమ్మెల్యేల ఎన్నికలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలుకు  గడువు విధిస్తూ నాలుగు వారాపాటు విచారణను వాయిదా వేసింది.

ఎన్నికల ప్రచారంలో ఈ ఎమ్మెల్యేల దగ్గర భారీ ఎత్తున నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు తమ పిటిషన్ లో వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి మామకు చెందిన ఫాంహౌజ్‌‌లో భారీగా నగదుతో పాటు మద్యం కూడా దొరికిందని పిటిషనర్ తెలిపారు. దాదాపు రూ.కోటి నగదుతోపాటు ఏ నేతకు ఎంతిచ్చారో రాసి ఉన్న డైరీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచి గెలిచారని.. వారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వారి ప్రత్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను, తమపై ఉన్న కేసులను కూడా చూపలేదని పిటిషన్‌లో తెలిపారు.

కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నికను సవాల్ చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. కోస్గిలోని నరేందర్ రెడ్డి పామ్‌హౌస్ పై ఐటీ దాడులు నిర్వహించగా రూ.51 లక్షల నగదు, దాదాపు రూ.6 కోట్ల 50 లక్షల ఖర్చుకు సబంధించి డైరీ లభ్యమైందని కోర్టుకు విన్నవించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆదాయపు పన్ను అధికారులు నివేదిక ఇచ్చారని, రూ.51 లక్షల నగదు దొరికినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. అయితే ఎన్నికల్లో రూ.19 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు నరేందర్ రెడ్డి లెక్కలు చూపించారని పిటిషన్‌లో రేవంత్ వివరించారు.

షాబాద్‌లో నరేందర్ రెడ్డి పేరు మీద పెట్రోల్ బంక్ ఉందని, ఈ లైసెన్స్ ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని ఆరోపించారు. ఎన్నికల ఖర్చులకు విదేశాల నిధులు తీసుకోవడం నిషేధమని.. అలా విరాళాలు తీసుకున్నట్లయితే పోటీకి అనర్హులని తెలిపారు. అమెరికా నుంచి ఎన్నికల ఖర్చుకోసం రూ.5లక్షలు వచ్చినట్లు అఫిడవిట్ లో చూపించారు. ఈ మూడు ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కోరారు.