ఎన్నికల పండుగ : నేడు, రేపు సెలవు
తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీ గురువారం జరుగనున్నాయి. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఇప్పటికే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ పలు చర్యలు తీసుకుంది. ఓటు వేసేందుకు లీవ్ కూడా ప్రకటించారు.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు
ఏప్రిల్ 10వ తేదీన స్కూళ్లకు, ఏప్రిల్ 11న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పరిశ్రమలకు, ఫ్యాక్టరీలకు కూడా సెలవు వర్తిస్తుందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.ఎం.వీ రెడ్డి తెలిపారు. సెలవు పాటించిన సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 11న ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలన్నీ వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం. దానకిషోర్ తెలిపారు.
Read Also : ఎన్నికల్లో..మద్యం,మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్