నగర ప్రయాణం.. నరక ప్రాయం

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 06:56 AM IST
నగర ప్రయాణం.. నరక ప్రాయం

Updated On : October 3, 2019 / 6:56 AM IST

హైదరాబాద్ లో వరుసగా కురిసిన కుండపోత వర్షాల వల్ల రోడ్లన్నీ అద్వానంగా తయారయ్యాయి. గల్లీ నుంచి మెయిన్‌ రోడ్ల వరకు అన్నీచోట్ల రోడ్లు పాడైపోయాయి. నగరవాసులు ఆ రోడ్లపై ప్రయాణించడానికి నరకయాతన పడుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో రహదారుల మరమ్మతులపై దృష్టి పెట్టారు GHMC అధికారులు.

వివరాలు.. హైదరాబాద్ లో ఎక్కువగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్ ఏరియాల్లో రోడ్లు గుంతలమయంగా వున్నాయి. అయితే ఐటీ కంపెనీలు ఎక్కువగా వున్న ఈ ప్రాంతంలో ఒకేసారి వాహనాలన్నీ రోడ్లపైకి రావడంతో.. ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రంగా ఏర్పడుతున్నాయి. మరోవైపు పంజాగుట్టా, సికింద్రాబాద్‌ మార్గాల్లో ఆరాంఘర్, మెహిదిపట్నం, లంగర్ హౌజ్ రూట్లల్లో కూడా భాగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ, హిమాయత్ నగర్, రామాంతపూర్, ఉప్పల్, ఎల్బీనగర్ ఏరియాల్లో కూడా రోడ్లు ఆధ్వానంగా తయారయ్యాయి.  

ఇక మెయిన్ రోడ్ల పరిస్థితి ఇలా వుంటే.. గల్లీ రోడ్లు మాత్రం మరీ ఆధ్వానంగా ఉన్నాయి. అడుగుతీసి అడుగు వెయ్యలేని పరిస్థితికి చేరుకున్నాయి. వర్షాలు తగ్గితే రెండు, మూడు రోజుల్లోనే ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేస్తామంటున్నారు. జోనల్ స్థాయిలో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి పూడ్చే పనులు చేస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.