ఫోర్బ్స్ యువ శాస్త్రవేత్తల లిస్ట్ లో హైదరాబాద్ యువకుడు

హైదరాబాద్: హైదరాబాద్ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ ఆసియా 30 జాబితాలో 2019 జాబితాలో ప్రవీణ్ కుమార్ గోరకీవి ఎంపికయ్యాడు. అత్యంత తక్కువ ధరలో కృత్రిమ కాలు, వాటర్ ప్యూర్ ఫై మిషన్ , మెకానికల్ బ్రెయిలీ టైప్ రైటర్ వంటి అనేక ఆవిష్కరణలు చేసిన ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 24 ఆసియా పసిఫిక్ దేశాల్లోని 30 ఏళ్లలోపు 30 ఏళ్లలోపు శాస్త్రవేత్తలను గుర్తించి అవార్డులు అందించేందుకు ఫోర్బ్స్ ఏషియా మ్యాగజైన్ భారతదేశంలో వివిధ రంగాల నుంచి 59 మందిని ఎంపికచేసింది. అందులో హెల్త్ అండ్ సైన్స్ విభాగంలో ఎంగ్ సైంటిస్ట్ గా ప్రవీణ్‌కుమార్ గోరకవి ఎంపికయ్యారు. తక్కువ ఖర్చుతో తేలికైన కృత్రిమ అవయవాలు (మోకాలు, కాలి మడమలు కూడా తిప్పడానికి అనువైన ఆర్టిఫిషియల్ లింబ్) రూపొందించినందుకుగాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
చిన్ననాటి నుంచే ప్రయోగాలు చేయటమంటే ఇష్టాన్ని పెంచుకున్న ప్రవీణ్ కుమార్ మైనంతో రాకెట్‌ను రూపొందించి 2004లోనే బాలశ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం చేతులమీదుగా అందుకున్నారు. నల్లకుంటలోని సెయింట్ ఆగస్టిన్ స్కూల్లో చదివరి ప్రవీణ్ కుమార్ దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్‌లోను చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు.
ప్రస్తుతం బన్సీలాల్‌పేటలోని నెక్లెస్ ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న 29 ఏండ్ల ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 28 ఉత్పత్తులను తాను కనిపెట్టాననీ..వాటిలో కొన్ని సామాన్య ప్రజల కోసం రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం యువ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఫై ఫ్యాక్టరీ పేరుతో అతి తక్కువ బరువైన కాటన్ బాక్స్‌లను రూపొందిస్తున్నామని..దీనివల్ల చెట్లను వినియోగించకుండా పర్యావరణాన్ని కాపాడగలుగుతామని పేర్కొన్నారు. సామాన్యులకు కూడా అందుబాటు ఉండేలా అత్యంత తక్కువ ధరలకు ఆవిష్కరణలను అందించాలన్నదే తన పరిశోధనల లక్ష్యమని ప్రవీణ్ తెలిపారు.జాబితాలో ఫోర్బ్స్లో చోటు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందనీ..ప్రవీణ్ తెలిపారు.