గాంధీ మార్గంలో సాగుదాం – అన్నా హాజారే

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 06:01 AM IST
గాంధీ మార్గంలో సాగుదాం – అన్నా హాజారే

హైదరాబాద్ : మహాత్మాగాంధీ చూపించిన మార్గంలో సాగాలని ప్రముఖ సామాజిక వేత్త అన్నాహాజారే పిలుపునిచ్చారు. నాలుగు గోడల మధ్య పూజలు..ప్రార్థనలు జరుగుతుంటాయని…కానీ గ్రామమే ఒక మందరిమని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడమే దేవుడికి పూజ చేసినట్లే అవుతుందన్నారు. ఇక్కడ గాంధీ భజన వైష్ణవ జనకో తేనే కహియెజే గుర్తుకు తెచ్చుకోవాలని…తాను ఓ దశలో ఆత్మహత్య చేసుకొనేందుకు యోచించినట్లు…కానీ విరమించుకున్నట్లు వెల్లడించారు. తన జీవితం ప్రజలకు..దేశానికేనన్నారు. తన ఇంటి పరిస్థితులు బాగా లేవని…తన ఊరి కోసం…దేశం కోసం..సమాజం కోసం పని చేయాలనే ఉద్దేశ్యంతో తాను పెళ్లి చేసుకోలేదన్నారు. తనకిప్పుడు 81 సంవత్సరాలని పేర్కొన్న హాజారే…తన స్వగ్రామమైన రాలిఖన్ సిద్ధిలో ఎన్నో సమస్యలుండేవన్నారు. కనీసం తాగడానికి నీళ్లు..తినడానికి భోజనం లేదన్నారు. దేశంలో మార్పు రావాలంటే..ముందుగా గ్రామంలో మార్పు రావాలని గాంధీ పిలుపునిచ్చారని తెలిపారు. ప్రకృతిని ధ్వంసం చేయవద్దని..ప్రకృతి ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని గాంధీ చూపిన మార్గంలో తాను సాగినట్లు హాజరే చెప్పారు.