23 నుంచి బతుకమ్మ చీరల పంపిణి

సెప్టెంబరు 23 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సీడీఎంఏ కార్యాలయంలో ప్రభుత్వం రూపోందించిన వివిధ డిజైన్ల బతుకమ్మ చీరలను గురువారం సెప్టెంబరు19న ప్రదర్శించారు. ప్రభుత్వం ఈ ఏడాది 10 రకాల డిజైన్లను 10 రకాల రంగులతో సిరిసిల్ల లోని నేత కార్మికులతో తయారు చేయించింది. మొత్తం కోటి చీరలు సిధ్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
అర్హత గల మహిళలు చీరలు ధరించటానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా పెద్దవయస్సు మహిళల కోసం 9 మీటర్లు చీరలు కూడా సిధ్దం చేశామని కేటీఆర్ వివరించారు. ఇవి సుమారు 10 లక్షల చీరలు సిధ్దంగా ఉన్నాయన్నారు. మిగతా 6 మీటర్లు చీరలు 90 లక్షలు వివిధ జిల్లాలకు పంపిస్తున్నామని ఆయన వివరించారు.
2017 నుంచి ఇప్పటి వరకు బతుకమ్మ చీరలమీద ప్రభుత్వం రూ.715 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, దీనివలన నేత కార్మికుల జీవన ప్రమాణాలు బాగుపడ్డాయని ఆయన చెప్పారు. వచ్చేఏడాదిలోగా బతుకమ్మ చీరలు బ్రాండ్ పేరుతో బహిరంగ మార్కెట్ లో కూడా ప్రవేశ పెట్టి నేత కార్మికులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు.