16 లక్ష్యం : KCR, KTR ఎన్నికల ప్రచార షెడ్యూల్

లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకొనే లక్ష్యంతో TRS వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే రిలీజ్ చేసింది. సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. అంతకంటే ముందే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలు నిర్వహించి కేడర్‌కు దిశా..నిర్దేశం చేశారు. తాజాగా కేసీఆర్..కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కేటీఆర్‌కు ముంబై నుండి ప్రత్యేక బస్సును తెప్పించారు. ఎల్బీస్టేడియం, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం వేళల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు.
కేసీఆర్ పర్యటన షెడ్యూల్ : –
తేదీ | స్థలం |
మార్చి 29 | మిర్యాలగూడ |
మార్చి 31 | వనపర్తి, మహబూబ్ నగర్ |
ఏప్రిల్ 1 | రామగుండం |
ఏప్రిల్ 2 | వరంగల్, భువనగిరి |
ఏప్రిల్ 3 | ఆందోల్, నర్సాపూర్ |
ఏప్రిల్ 4 | మహబూబాబాద్, ఖమ్మం |
కేటీఆర్ ప్రచార షెడ్యూల్ : –
తేదీ | స్థలం |
మార్చి 25 | సిరిసిల్ల |
మార్చి 27 | ముస్తాబాద్ |
మార్చి 29 | ఎల్లారెడ్డిపేట |
మార్చి 31 | గంభీరావుపేట |
ఏప్రిల్ 2 | సిరిసిల్ల |