విభజన జరగలేదు : ఏపీఎస్ ఆర్టీసీలోనే ఉన్నాం.. కార్మికులు భయపడొద్దు

ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణన ప్రకటించింది. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన కార్యక్రమాలకు తమ సపోర్టు ఉంటుందన్నారు నేతలు. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..
ప్రస్తుతం ఆర్టీసీ విభజన జరగలేదని, ఇంకా ఏపీఎస్ఆర్టీసీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు కోదండరాం. ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..కార్మికులు భయపడవద్దని భరోసా ఇచ్చారు. నవంబర్ 04 లేదా 05వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతామని, ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితిపై వారికి వివరించడం జరుగుతుందన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.
నవంబరు 3న అమరుల కోసం పల్లెబాట, 4న రాజకీయ పార్టీలతో కలిసి డిపోల ఎదుట దీక్షలు, నవంబరు 5న రహదారుల దిగ్బంధం చేస్తామన్నారు. నవంబరు 6న కుటుంబ సభ్యల నిరసన, 7న ప్రజా సంఘాల నిరసన, 9న ట్యాంక్ బండ్‌పై నిరసన దీక్ష చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.
Read More : ఉద్యమం ఉధృతం : ఆర్టీసీ జేఏసీ కార్యచరణ ఇదే..చలో ట్యాంక్ బండ్