తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు : కృష్ణా నీటి కేటాయింపులు

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అధికారులు అధికారులు చర్చను చేపపట్టారు. సుదీర్ఘంగా చర్చించిన మీదట తెలంగాణకు 29 టీఎంసీలు..ఏపీకి 17.5 టీఎంసీల నీటి కేటాయింపులకు అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన నీటి పారుదల అధికారులు బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏపీ నీటి వినియోగంపై..ఏపీ తన అవసరాలకంటే ఎక్కువగా వినియోగించుకుంటున్నారంటు త్రిసభ్య కమిటీకి..కృష్ణాబోర్డుకు, సెంట్రల్ వార్డ్ కమిషన్ లకు పలు ఫిర్యాదుల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి తాగు,సాగు నీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇరు రాష్ట్రాల అధికారులు ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధికారులు పరస్పర అంగీకారంతో నీటి కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేసింది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ.