మద్యం దుకాణాలు బంద్: అమ్మితే లైసెన్స్‌లు రద్దు
తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం అమ్మాకాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది.

తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం అమ్మాకాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది.
తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం అమ్మాకాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నాయకులు మద్యం పంచకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిఘా పెంచిన ఆబ్కారీ.. ఏరోజు కారోజు మద్యం క్రయ, విక్రయాలను ఎన్నికల సంఘంకు వెల్లడిస్తుంది.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపే మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణాపై దాడులు జరిపి అక్రమ మద్యంను సీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి గురువారం సాయంత్రం 6గంటల వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు చెప్పారు.
ఈ ఆంక్షలు వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, అన్ని రకాల స్టార్ హోటళ్లు (మద్యం సరఫరాచేసే హోటళ్లు) కు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల్లో ఎవరైనా మద్యం విక్రయాలకు పాల్పడితే వారి లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు ఎలక్షన్ కోడ్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆబ్కారీ, పోలీసు అధికారులు హెచ్చరించారు.
Read Also : మూగబోనున్న మైకులు : ఎన్నికల ప్రచారం, ప్రకటనలు బంద్