చంద్రబాబుకు మంత్రి తలసాని సవాల్ : తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని ఏపీలోనే ఉండు

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 02:12 PM IST
చంద్రబాబుకు మంత్రి తలసాని సవాల్ : తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని ఏపీలోనే ఉండు

Updated On : April 13, 2019 / 2:12 PM IST

తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రవారిపై కేసులు వేశారన్న చంద్రబాబు ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రవారిపై కేసులు వేశారన్న వార్తలు అవాస్తవమన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని ఏపీలోనే ఉండాలని సవాల్ చేశారు.

చంద్రబాబు నిజంగా నిజాయితీ పరుడైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆయన ఆస్తులను అమ్మేసి పర్మినెంట్ గా ఏపీలోనే ఉండాలన్నారు. అప్పుడు ఆయన మాట్లాడింది తప్పో, ఒప్పో ప్రజలే డిసైడ్ చేస్తారని తెలిపారు.