మే 12న MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని MMTS రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. బేగంపేట-సనత్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్‌కు సంబంధించిన మరమ్మతుల కారణంగా ఈనెల 12న 14 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు.
రద్దు కానున్న రైలు సర్వీసులు-రైలు నంబర్లు
- ఫలక్‌నుమా-లింగంపల్లి (47149)
- లింగంపల్లి-ఫలక్‌నుమా (47173)
- లింగంపల్లి-ఫలక్‌నుమా (47171)
- ఫలక్‌నుమా-లింగంపల్లి (47151)
- ఫలక్‌నుమా-లింగంపల్లి (47150)
- లింగంపల్లి-ఫలక్‌నుమా (47174)
- హైదరాబాద్-లింగంపల్లి (47100)
- లింగంపల్లి-హైదరాబాద్ (47127)
- హైదరాబాద్-లింగంపల్లి (47101)
- లింగంపల్లి-హైదరాబాద్ (47128)
- లింగంపల్లి-హైదరాబాద్ (47129)
- హైదరాబాద్-లింగంపల్లి (47105)
- ఫలక్‌నుమా-లింగంపల్లి (47153)
- లింగంపల్లి-ఫలక్‌నుమా (47176)
ఈ మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా ఒక్క రోజు రద్దు చేసినట్లు తెలిపారు. పనులు ముగిసిన వెంటనే పునరుద్ధరిస్తామని సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.