ఇంటర్ బోర్డుపై  హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు

  • Published By: chvmurthy ,Published On : April 26, 2019 / 02:23 PM IST
ఇంటర్ బోర్డుపై  హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు

Updated On : April 26, 2019 / 2:23 PM IST

హైదరాబాద్ : ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లనే 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, దీంతో పాటు 18 మంది విధ్యార్ధులు చనిపోయారని ఆయన తన పిటిషన్ లో పేర్కోన్నారు. పిటిషన్ ను వచ్చే సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉందని పీటిషనర్ తెలిపారు.