పటాన్ చెరుకు బైపాస్ :  ట్రాఫిక్ కష్టాలకు చెక్

పటాన్ చెరులోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీని తగ్గించేందుకు బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు  ప్రభుత్వం నిర్ణయించింది.

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 07:45 AM IST
పటాన్ చెరుకు బైపాస్ :  ట్రాఫిక్ కష్టాలకు చెక్

పటాన్ చెరులోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీని తగ్గించేందుకు బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు 
ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ : పటాన్ చెరులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పటాన్ చెరులోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీని తగ్గించేందుకు బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు 
ప్రభుత్వం నిర్ణయించింది. రూ.95 కోట్లతో బైపాప్ రోడ్డును నిర్మించనున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రతిపాదనలు తయారు చేయగా, పాలనా పరమైన అనుమతులు కూడా వచ్చాయి. వెంటనే టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు తయారు చేస్తోంది. పటాన్ చెరుకు బైపాప్ రోడ్డు నిర్మాణం వల్ల రావాణా అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయిని అధికారులు చెబుతున్నారు. 

పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన పటాన్ చెరు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. జాతీయ రహదారి నెంబర్ 65 పై ఉన్న పటాన్ చెరులో కొన్ని నిమిషాలపాటు వాహనాలు నిలిచిపోతే కిలో మీటరు మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో వివిధ కంపెనీలకు రాకపోకలు సాగించే వాహనాలతో స్థానికంగా ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దౌల్తాబాద్ వైపు వెళ్లేందుకు, శంకర్ పల్లి వైపు వెళ్లడానికి మాదారం వైపు వెళ్లేందుకు.. ఇలా పలు ప్రాంతాలకు వెళ్లడానికి పటాన్ చెరు కేంద్రంగా మారడంతో వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. పటాన్ చెరుకు వచ్చే ప్రధాన జాతీయ రహదారి గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాల రద్దీని తగ్గించేందుకు బైపాప్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.

పటాన్ చెరులో బైపాప్ రోడ్డును రూ.95 కోట్లతో నిర్మించడానికి హెచ్ ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలి భాగంలోనే నేషనల్ హైవే నుంచి దౌల్తాబాద్ వైపు వెళ్లే ఇంద్రేశం రోడ్డుకు కలుపుతూ కొత్త రోడ్డును నిర్మించనున్నారు. పటాన్ చెరు ఇండస్ట్రీయల్ ప్రాంతం నుంచి కాలువపై నుంచి బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తూ రోడ్డును వేయనున్నారు. 1.95 కిలో మీటర్లు ఉండే బైపాస్ రోడ్డును నాలుగు లైన్లతో చేపట్టాల్సి ఉంది. బైపాప్ రోడ్డు పంట పొలాల నుంచి వెళ్లనుంది. ఇందుకోసం భూసేకరణ చేయాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు కూడ రావడంతో టెండర్లు ఆహ్వానించి పనుల చేపట్టేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. పటాన్ చెరు ఇండస్ట్రీయల్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నిర్మించే బైపాస్ రోడ్డుతో ట్రాఫిక్ కష్టాలు తీరునున్నాయి. ప్రయాణం సాఫీగా సాగనుంది. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోనున్నారు.