కుల భోజనం కాదు వన సంరక్షణ : పవన్ కొత్త నినాదం

పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో వన రక్షణ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 06:00 AM IST
కుల భోజనం కాదు వన సంరక్షణ : పవన్ కొత్త నినాదం

Updated On : October 30, 2019 / 6:00 AM IST

పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో వన రక్షణ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 29, 2019) హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో వన రక్షణ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి పవన్ మొక్కలు నాటడంతోపాటు అందరితో నాటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడం ఒక్కటే సరిపోదని.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనదేనని పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు. పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామన్నారు. మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియ అని అది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. వన సంరక్షణ కార్యక్రమం ద్వారా ప్రకృతితో మమేకం కావాలని పిలుపునిచ్చారు.

కార్తీక వన సమారాధన కార్యక్రమాలపైనా పవన్ స్పందించారు. వన సమారాధనలు కుల భోజనాల కార్యక్రమాలు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమారాధన ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. మనిషి ప్రకృతితో ఎలా మమేకం కావాలో పురాణాలు, వేదాలు వివరిస్తున్నాయని అన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాలు కూడా అందులో భాగమేనని ఆయన అన్నారు.