కరోనా భయం లేకుండా అర్థరాత్రి వరకు డ్యాన్సులు, చిందులు.. హైదరాబాద్ పబ్‌లలో దారుణాలు

police raids on pubs in jubilee hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పబ్‌లపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కొరడా ఝులిపించారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్ యాజమానుల ఆట కట్టించారు. కరోనా ప్రోటోకాల్స్‌ను పూర్తిగా బేఖాతరు చేసిన నాలుగు పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు చేసింది. ఈ లిస్ట్‌లో తబులా, ఎయిర్ లైవ్, కెమిస్ట్రీ, అమ్మేసియా పబ్‌లు ఉన్నాయి. అనుమతులు లేకుండా డ్యాన్స్ ఫ్లోర్లను పబ్‌లు ఓపెన్ చేశాయి.
అర్ధరాత్రి వరకు డ్యాన్సులు:
పబ్‌కు వచ్చిన కస్టమర్లు అర్ధరాత్రి వరకు డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ చేశారు. మత్తు ఎక్కువైపోయి మాస్కులు మరిచిపోయారు. కిక్ ఎక్కువైపోయి ఫిజికల్ డిస్టెన్స్ గాలికి వదిలేశారు. దీనికి తోడు సర్వీస్ చేస్తున్న వారు సైతం మాస్కులు ధరించ కుండానే పబ్‌కు వచ్చినవారికి సర్వీస్ చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పబ్ యజమానులపై టాస్క్‌ఫోర్స్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
కాసుల కోసం కక్కుర్తి:
ప్రభుత్వం, అధికారులు కరోనా పట్ల ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది మాత్రం ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ పబ్‌లు నిర్వహిస్తున్నారు. మామూలుగానే హైదరాబాద్‌లో పబ్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లఘించడంలో ఎక్స్‌పర్ట్‌లు. ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లోనూ విచ్చలవిడిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మాస్కులు, భౌతికదూరం లేకుండా పబ్‌లలో యువత చిందులు తొక్కుతోంది. తమకేం కరోనా రాదన్నట్టు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.
పబ్ లు.. అనుమతులు లేకుండా డ్యాన్స్ ఫ్లోర్‌ను తేవడం, కోవిడ్ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేయడం, మాస్కులు లేకుండా పబ్బుకు అనుమంతిచడం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. నో మాస్క్ నో ఎంట్రీ విధానానికి స్వస్తి చెప్పిన పబ్బు యజమానులు.. కాసుల కోసం కక్కుర్తి పడి కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్‌లోని పబ్‌లుపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కొరడా ఝుళిపించారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్ యజమానుల ఆట కట్టించారు. కరోనా ప్రోటోకాల్స్‌ను పూర్తిగా బేఖాతరు చేసిన నాలుగు పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు చేసింది. ఈ లిస్ట్‌లో తబలారస, ఎయిర్ లైవ్, కెమిస్ట్రీ, అమేన్సియ పబ్‌లు ఉన్నాయి. అనుమతులు లేకుండా డ్యాన్స్ ఫ్లోర్లను పబ్‌లు ఓపెన్ చేశాయి.
పబ్‌కు వచ్చిన కస్టమర్లు అర్ధరాత్రి వరకు డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ చేశారు. మత్తు ఎక్కువైపోయి మాస్కులు మరిచిపోయారు. కిక్ ఎక్కువైపోయి ఫిజికల్ డిస్టెన్స్ గాలికి వదిలేశారు. దీనికి తోడు సర్వీస్ చేస్తున్న వారు సైతం మాస్కులు ధరించ కుండానే పబ్‌కు వచ్చినవారికి సర్వీస్ చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పబ్ యజమానులపై టాస్క్‌ఫోర్స్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.