నిరాహార దీక్షకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ నాయకులు
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇందిరా పార్క్ వద్ద చేయతలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వీఎస్‌టీ సమీపంలోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో దీక్ష చేయాలని నిర్ణయించారు.
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు శనివారం నిరాహార దీక్ష తలపెట్టారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ దీక్ష చేస్తారు. వీఎస్‌టీ వద్ద ఉన్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేయాలని ఈ నలుగురు నేతలు నిర్ణయించారు. దీంతో ఈయూ కార్యాలయం వద్ద పోలీస్ నిఘా పెంచారు. అలాగే బందోబస్త్ ఏర్పాటు చేశారు.
మరోవైపు సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. విలీనం డిమాండ్‌ను పక్కన పెట్టినా చర్చలకు పిలువని ప్రభుత్వ తీరును అశ్వత్థామరెడ్డి తప్పు పట్టారు. ఈ నెల 17, 18 తేదీల్లో డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది.
నవంబర్ 19న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు రహదారులను దిగ్బంధిచాలని నిర్ణయించింది. ఇంకోవైపు విలీనం డిమాండ్‌పై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సమ్మెను వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు రాష్ట్రంలోని పలు డిపోల వద్ద ధర్నాలు చేశారు.