తెలంగాణ అసెంబ్లీ 14వ తేదీకి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం గం.11-30 కి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వాటాలో కోత విధించినప్పటికీ .. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
శనివారం బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చించనున్నారు. అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో ఆర్థికమంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.