అందరికీ ఆదర్శం : పోచారం ఉమ్మడి కుటుంబం

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 03:28 AM IST
అందరికీ ఆదర్శం : పోచారం ఉమ్మడి కుటుంబం

హైదరాబాద్ : ఉమ్మడి కుటుంబం..కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై, చిన్న కుటుంబం అనే భావనలు ఏర్పడుతున్నాయి. కన్నతల్లిదండ్రులనే చూడటానికి ఇష్టపడని  వారు ఇంకా ఉమ్మడిగా జీవిస్తారా ? కానీ ఇప్పటికే  ఓ నేత ఉమ్మడిగా జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు…ఆయనే  పోచారం శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వ హాయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న  ఈయన తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌గా 2019, జనవరి 18వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించారు. 
ఈ సందర్భంగా పోచారం ఫ్యామిలీ మొత్తం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను  కలిసింది. గవర్నర్, సతీమణి విమలా నరసింహన్ వారిని సాదారంగా  ఆహ్వానించారు. ఉమ్మడి కుటుంబాన్ని చూసిన గవర్నర్ దంపతులు ఆనందం  వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబం ఇలా ఉండాలి…బంధాలు..అనుబంధాలు..విలువలను ప్రతిబింబించాలని గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా పోచారం కుటుంబసభ్యులతో గవర్నర్ దంపతులు ఫొటోలు దిగారు.