రాష్ట్రాన్ని దివాళా తీయించామా..సభను తప్పుదోవ పట్టించొద్దు – కేసీఆర్

రాష్ట్రాన్ని దివాళా తీయించామా ? సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 14వ తేదీ శనివారం ప్రారంభమయ్యాయి. సభలో కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ జోక్యం చేసుకున్నారు.
విషయం చూసి మాట్లాడుతే..బాగుంటుందని హితవు పలికారు. మొత్తం సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రతి లెక్క కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ధృవీకరించి..నిర్దారించిందన్నారు. శాసనసభకు సమర్పించిన లెక్కలు అని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రమే లేదు..బడ్జెట్ ఎక్కడిది..మిగులు బడ్జెట్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు.
విమర్శలు చేయడానికి ఒక హధ్దు ఉంటుందన్నారు. చాలా కష్టం మీద లెక్కలు రూపొందించినట్లు..వెంటనే భట్టి వ్యాఖ్యలను సవరించుకోవాలని సూచించారు. వాస్తవాలను తమ ప్రభుత్వం ప్రజలకు వివరిస్తుందన్నారు. ఎన్నో రాష్ట్రాల కంటే ఉత్తమమైన రాష్ట్రంగా ఉందన్న సీఎం కేసీఆర్..ఏ ర్యాంకులో రాష్ట్రం ఉందో..సభలో వెల్లడిస్తామన్నారు.