తెలంగాణ కేబినెట్ విస్తరణ : ఏ శాఖ అప్పగించినా స్వీకరిస్తా – సబితా ఇంద్రారెడ్డి

తనకు ఏ శాఖ అప్పగించినా..స్వీకరిస్తానని..సీఎం కేసీఆర్..నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకొనే విధంగా పని చేస్తానని టీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ప్రమాణానికి రాజ్ భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో సబితా ఇంద్రారెడ్డికి చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆమెతో 10tv మాట్లాడింది.
తనను మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు సంతోషంగా ఉందని..కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధించాలనే తపన, ఆలోచన తన భర్త ఇంద్రారెడ్డిలో ఉండేదని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని రాష్ట్రంలోని పథకాలను పరిశీలించాలని అనుకుంటున్నాయన్నారు. నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉదన్నారు.
రాష్ట్ర ప్రజలకే కాకుండా..జిల్లా ప్రజలకు మేలు జరిగే విధంగా చూస్తానన్నారు. లోకల్ బాడీ, మార్కెట్ కమిటీల్లో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి..ఆ తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 9 నెలల తర్వాత కేబినెట్ విస్తరిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం కేబినెట్ సభ్యుల సంఖ్య 12గా ఉంది. దామాషా ప్రకారం సీఎంతో సహా మంత్రుల సంఖ్య 18కి మించరాదు. దీంతో కేబినెట్‌లో ఆరు ఖాళీలున్నాయి. హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌లకు పదవులు ఖరారయ్యాయి.
Read More : సబితకు హోం, హరీష్ కి ఆర్థిక : కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలు ఇవే