నేడే కేబినెట్ విస్తరణ : ఆ ఇద్దరికి పదవులు ఖాయం
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేటీఆర్, హరీష్‌రావుకు కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేటీఆర్, హరీష్‌రావుకు కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేటీఆర్, హరీష్‌రావుకు కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండడంతో… మొత్తం ఇదే దఫాలో భర్తీ చేస్తారా, లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ సీఎంగా… మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఫిబ్రవరి 19న మరో 10మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడే రెండోసారి మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించనున్నారు. అంతేకాకుండా అన్ని రకాల పదవులను భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ విప్‌ల నియామకాన్ని ఖరారు చేసిన కేసీఆర్… ఆదివారం దశమి పూట మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉండటంతో… ఎవరికి చోటు దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న ప్రచారం సాగుతోంది. సీఎం ఆదేశాలతో రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ కూడా ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు.
సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే… ఆశావహుల పేర్లు భారీగానే ఉన్నాయి. తొలి విడతలో చోటు దక్కని కేటీఆర్, హరీశ్‌రావుకు ఈ విడతలో బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చే మంత్రులు ఎవరూ లేకపోవడంతో… హరీశ్, కేటీఆర్‌లను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇద్దరు మహిళా మంత్రులను తీసుకుంటామని కేసీఆర్ గతంలో ప్రకటించడంతో…. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లేదా హరిప్రియా నాయక్‌లకు అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో… తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌లలో… ఒకరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దర్నీ కేబినెట్‌లోకి తీసుకోకపోతే… అదే జిల్లాకు సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు ఛాన్స్ దక్కుతుందన్న ప్రచారం కూడా ఉంది. కొత్తగా పలువురు మంత్రుల్ని తీసుకోబోతున్న కేసీఆర్… ప్రస్తుతమున్న వారిలో ఇద్దరు లేదా ముగ్గుర్ని ఉద్వాసన పలికే అవకాశాలున్నాయి. అదే జరిగితే… జోగు రామన్న, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశమిస్తారని ప్రచారం సాగుతోంది.
మరోవైపు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్ని కేసీఆర్ భర్తీ చేస్తారా… లేక కొన్ని పెండింగ్‌లో పెడతారా అనే ఆసక్తి నెలకొంది. పూర్తిస్థాయిలో విస్తరణ జరక్కపోతే… ప్రస్తుతం నలుగురికి మాత్రం చోటు దక్కనుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత… కొంతమందిని తప్పించి… వారి స్థానంలో కొత్త నేతలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా… కొత్త మంత్రులకు ఇప్పటికే ప్రగతి భవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.