RTC సమ్మె ఎఫెక్ట్: దసరా సెలవులు పొడిగింపు?

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 03:06 AM IST
RTC సమ్మె ఎఫెక్ట్: దసరా సెలవులు పొడిగింపు?

Updated On : October 10, 2019 / 3:06 AM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె  ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

అసలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగకపోడంతో తెలంగాణ సర్కార్ ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ సారి ఎప్పుడూ లేని విధంగా 16 రోజులు హాలీడేస్ వచ్చాయి. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటం, మరోపక్క పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం సెలవులను పొడిగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.