ఆర్టీసీ సమ్మె : రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600

తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 2 వేల స్పెషల్ బస్సులు నిలిచిపోయాయి. 57వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. స్కూల్స్, కాంట్రాక్టు క్యారేజీ బస్సులు సిద్ధం చేసింది. 2వేల 100 అద్దె బస్సులు, 6వేల 900 స్కూలు బస్సులును ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల దగ్గర 144 సెక్షన్ విధించింది. అన్ని డిపోలు, బస్టాండ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో కొన్ని బస్సులను ఇప్పటికే అధికారులు రోడ్డెక్కించారు.
డిపోల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కార్మికుల సమ్మె ప్రభావం దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి మీద పడకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో 4వేల 153 మంది కార్మికులు విధుల్లో చేరకుండా ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లాలో పోలీసు భద్రతతో ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7 డిపోల్లోని ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల పరిధిలోని 2వేల 500 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.
నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. దూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు డ్రైవర్లు శుక్రవారమే(అక్టోబర్ 4,2019) విధుల నుంచి వైదొలిగారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే సమ్మె మొదలైనట్లయింది. సిటీ బస్సులు శనివారం(అక్టోబర్ 5,2019) ఉదయం నుంచే డిపోలకే పరిమితమయ్యాయి. ఆదివారం హాలీడే కావడంతో ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులు బస్ స్టాండ్‌లలో తంటాలు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీకి దిగాయి. టికెట్ల ధరలు అమాంతం పెంచేశాయి. వందల్లో ఉండాల్సిన టికెట్ ధరను వేల రూపాయలకు పెంచేశారు. మరోవైపు ప్రైవేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
ఆర్టీసీ సమ్మెను ఎదుర్కొనేందుకు రవాణశాఖ సిద్ధమైంది. అధికారులు 9వేల ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను నియమించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లు అదనంగా నడపనున్నారు. అంతేకాదు మెట్రో రైలు సమయాలు కూడా పొడిగించారు. ఉ. 5 గంటల నుంచి రా. 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. రద్దీ సమయాల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక రైలుని నడిపేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందలు కలగకుండా మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఈయూ నేతలు మద్దతు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఎస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏపీలో కూడా ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు.
Also Read : ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం వార్నింగ్ : విధుల్లో చేరకపోతే ఉద్యోగం ఊడుతుంది