కేసీఆర్ – జగన్‌ల భేటీ 24న!

  • Published By: madhu ,Published On : September 20, 2019 / 04:27 AM IST
కేసీఆర్ – జగన్‌ల భేటీ 24న!

Updated On : September 20, 2019 / 4:27 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. మూడు దఫాలుగా వీరిద్దరూ సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరిగాయి. పలు అంశాలపై అంగీకారం కూడా కుదిరింది. అయితే ..ఇంకా కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉన్నాయి. కానీ..ఇరు రాష్ట్రాల్లో శాసనసభ సమావేశాలు జరగడం..ఇతరత్రా కారణాలతో సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

తాజాగా సెప్టెంబర్ 24వ తేదీన ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరుగనుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ సమావేశం ఉంటుందని సమాచారం. దీనిపై సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. 

ఇదే సమావేశంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కూడా ఇరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉంది. బీజేపీపై ఇరు రాష్ట్రాల సీఎంలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదనే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉంది.