తెలుగు రాష్ట్రాల డీజీపీల భేటీ

తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తెలుగు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయ్యారు. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఇరు రాష్ట్రాల డీజీపీలు చర్చించారు. పోలీసు పోస్టింగ్‌లు, డీఎస్పీల సీనియార్టీ, ప్రమోషన్లపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఇరువురు డీజీపీలు రాజ్ భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌తో భేటీ అయ్యారు. తాము జరిపిన సమావేశ వివరాలను గవర్నర్‌కు వెల్లడించారు. డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో గతంలో అవతవకలు జరిగాయని ప్రచారం జరిగింది.