కొత్త కొలువులకు కండీషన్ అప్లై: ఆర్టీసీలో చేరాలంటే అందులో సంతకం చేయాల్సిందే

  • Published By: vamsi ,Published On : October 7, 2019 / 03:30 AM IST
కొత్త కొలువులకు కండీషన్ అప్లై: ఆర్టీసీలో చేరాలంటే అందులో సంతకం చేయాల్సిందే

Updated On : October 7, 2019 / 3:30 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులుతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ముందు ప్రకటించినట్లే సమ్మె ప్రారంభించగా.. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 1200మందిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని, మిగిలినవారిని ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ఉద్యోగానికి వచ్చే కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని, రాని వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చుకోమని స్పష్టం చేసింది. కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు కేసిఆర్. ఉద్యోగుల నియామక ప్రక్రియను వీలైనంత చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదు కొత్త సిబ్బందికి కొన్ని కండిషన్లను పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని.. ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టంచేశారు. ఇదే క్రమంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరేవాళ్లు ఏ యూనియన్‌లో చేరమని ఒప్పంద పత్రంపై సంతకం చేయాలనే కండీషన్ పెట్టారు. ప్రత్యేక షరతులతో కొత్త సిబ్బంది నియామకం ఉంటుందని స్పష్టం చేశారు.