Revanth reddy slams bjp: సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నారు: రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ తీరుపై టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేపటి నుండి ప్రారంభమయ్యే “భారత్ జోడో యాత్ర” పోస్టర్ ను గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీ, అమిత్ షా భయపడుతున్నారని అన్నారు. తమ పార్టీ నిర్వహించనున్న భారత్ జోడో యాత్ర సాధారణ పాదయాత్ర కాదని ఆయన చెప్పారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసమే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు.

Revanth reddy slams bjp: సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నారు: రేవంత్ రెడ్డి

munugode bypoll-2022

Updated On : September 6, 2022 / 4:52 PM IST

Revanth reddy slams bjp: కేంద్ర ప్రభుత్వ తీరుపై టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేపటి నుండి ప్రారంభమయ్యే “భారత్ జోడో యాత్ర” పోస్టర్ ను గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీ, అమిత్ షా భయపడుతున్నారని అన్నారు. తమ పార్టీ నిర్వహించనున్న భారత్ జోడో యాత్ర సాధారణ పాదయాత్ర కాదని ఆయన చెప్పారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసమే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశ సమైఖ్యతను కాపాడడానికే కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని, పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హక్కుల కోసం పోరాడుతుంటే బీజేపీ కేసులు పెట్టిస్తోందని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయని ఆయన విమర్శించారు. పోరాడే వారిని జైళ్ళలో నిర్బంధిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజల మీద బీజేపీ దాడి చేస్తోందని ఆయన అన్నారు.

Strict lockdown in China: భూకంపంతో 65 మంది చనిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న చైనా