దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయింది : కేటీఆర్

దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 09:41 AM IST
దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయింది : కేటీఆర్

Updated On : March 13, 2019 / 9:41 AM IST

దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్ : దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ మతం, కులం పేరుతో రాజకీయ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రాంతాల పేరుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా గందరగోళంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని పేర్కొన్నారు. మార్చి 13 బుధవారం జహీరాబాద్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పేదల కోసం కేసీఆర్ బ్రహ్మాండమైన పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. 
Read Also : గులాబీ సీట్లు, కారు గుర్తుతో YSR కాంగ్రెస్ ప్రచార వాహనాలు

తెలంగాణ రైతులను గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటి అవుతుందని భయపెట్టారని గుర్తుచేశారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్నామని తెలిపారు. రాబోయే సీజన్ నుంచి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఏప్రిల్ లేదా మే నుంచి రూ.2 వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరితే కేంద్రం స్పందించలేదన్నారు.