కేసీఆర్.. నా పెద్ద కొడుకు

  • Published By: vamsi ,Published On : January 17, 2020 / 01:44 AM IST
కేసీఆర్.. నా పెద్ద కొడుకు

Updated On : January 17, 2020 / 1:44 AM IST

తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మున్సిపల్ పోరుకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఎన్నికల హీట్ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న టీఆర్ఎస్ ఇప్పటికే అందుకు సంబంధించి నాయకులకు దిశా నిర్ధేశం చేసింది. మున్సిపల్ పోరులో నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిని నిర్ణయాలు తప్పవని గులాబీ బాస్ ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనగామలోని 7వ వార్డులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా.. ప్రచారంలో ఆయనకు ఒక ముస్లిం వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌కు ఓటు వేయమని అడగబోతుండగా.. కేసీఆర్ మా పెద్దకొడుకు అంటూ ఆమె చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మాటల్లో మాట కలవడంతో..ఏమిటి? అని పోచంపల్లి మరోసారి ఆమెను అడుగగా కేసిఆర్ మా పెద్ద కొడుకు అంటూ మరోసారి కేసిఆర్ మీద ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పోచంపల్లి ఆమెకు కారు గుర్తు చూపిస్తూ..టీఆర్ఎస్ ఓటేయాలని కోరారు. బామ్మ కేసీఆర్ పెద్ద కొడుకు అంటూ చెప్పిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండా గులాబి పార్టీ అభిమానులు వీడియోని షేర్ చేసుకుంటున్నారు.